లాభాల్లో నాస్డాక్ కానీ…
వాల్‌స్ట్రీట్ మిశ్రమంగా ఉంది. ఇవాళ క్రూడ్ ఆయిల్ భారీగా క్షీణించడంతో ఎనర్జీ షేర్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. దీంతో డౌజోనస్ 0.5 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇక ఎస్ అండ్ పీ 500 సూచీ 0.3 శాతం నష్టంతో ట్రేడవుతుండగా నా్స్ డాక్ మాత్రం 0.7 శాతం లాభంతో ఉంది. ఆరంభంలో ఒక శాతంపైగా లాభంతో ఉండేది. ఇవాళ బాండ్ ఈల్డ్స్ తగ్గినా.. డాలర్ మళ్లీ 105 దగ్గరకు ప్రయాణిస్తోంది. అమెరికాలో మాంద్యం తప్పదని వార్తలు వస్తున్న నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ డిమాండ్ తగ్గుతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో క్రూడ్ ఆయిల్ గత రెండు సెషన్స్‌లో ఆరు డాలర్లకు పైగా క్షీణించింది. ఇవాళ 5 శాతం క్షీణించి బ్రెంట్ క్రూడ్ 114 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బులియన్ మార్కెట్లో పెద్ద మార్పు లేదు.