వాల్‌స్ట్రీట్: నాస్‌డాక్ అప్
అమెరికా స్టాక్ మార్కెట్లు ఊగిసలాడుతున్నాయి. ఓపెనింగ్‌లో గ్రీన్‌లో ఉన్న డౌజోన్స్ నష్టాల్లోకి రాగా, నాస్‌డాక్ మాత్రం ఒక మోస్తరు లాభాలతో ట్రేడవుతోంది. ప్రస్తుతం 0.46 శాతం లాభంతో నాస్‌డాక్ ట్రేడవుతోంది. ఇక ఎస్ అండ్ పీ 500 సూచీ 0.25 శాతం లాభంతో ఉంది. మరోవైపు గ్రీన్‌లో ఉన్న డాలర్ ఇండెక్స్ కూడా రెడ్‌లోకి వెళ్ళింది. ఫలితంగా క్రూడ్ ఆయిల్ నష్టాలు బాగానే తగ్గాయి. అలాగే బులియన్ మార్కెట్ కూడా తన నష్టాలను తగ్గించుకుంది. వెరశి మార్కెట్లలో పెద్ద మార్పు లేదు.