దుమ్ము రేపుతున్న ఈక్విటీ మార్కెట్లు
ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. తొలుత ఆసియా మార్కెట్లు .. తరవాత యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ఆరంభంలో అతి తక్కువ లాభాలతో ప్రారంభమైన యూరో మార్కెట్లు రెండు శాతంపైగా లాభంతో ముగిశాయి. యూరో స్టాక్స్ 50 సూచీ 2.68 శాతం లాభంతో ముగిసింది. అదే సెంటిమెంట్ అమెరికాలో కన్పించింది. ఐటీ, టెక్ షేర్లు భారీ లాభాలతో ఉన్నాయి. మెటా, ఏఎండీ ఏర్లు ఇవాళ ఒక్క రోజే ఆరు శాతం పెరిగాయి. ఇతర షేర్లు రెండు శాతంపైగా పెరిగాయి. వారం రోజుల్లోనే యాపిల్ షేర్ 130 డాలర్ల నుంచి 140 డాలర్లకు చేరింది. ముఖ్యంగా మాంద్యం వచ్చినా 12 నెలల తరవాత అని చాలా మంది ఆర్థికవేత్తలు చెప్పడంతో పాటు కొత్త ఇంటి అమ్మకాల గణాంకాలు చాలా పాజిటివ్‌గా ఉండటంతో మూడు ప్రధాన సూచీలు రెండు శాతం కన్నా అధిక లాభాలతో ట్రేడవుతున్నాయి. బాండ్ ఈల్డ్స్ పెరిగినా ఈక్విటీ మార్కెట్లు రాణించడం విశేషం. డాలర్ స్వల్పంగా క్షీణించింది. అయితే క్రూడ్ ఆయిల్ మూడు శాతం దాకా పెరగడం విశేషం. బులియన్ మార్కెట్ చాలా డల్‌గా ఉంది.