For Money

Business News

జొమాటొ చేతికి బ్లింకిట్‌

బ్లింకిట్‌ (పాత పేరు గ్రోఫర్స్‌)ను జొమాటొ టేకోవర్‌ చేసింది. షేర్ల బదిలీ ద్వారా టేకోవర్ చేసేందుకు జొమాటొ బోర్డు డైరెక్టర్లు ఇవాళ ఆమోదం తెలిపింది. డీల్‌ విలువ రూ. 4447 కోట్లు. ఇటీవల బ్లింకిట్‌ విలువ 100 కోట్ల డాలర్లు అంటే రూ. 7800 కోట్లు లెక్కించారు. అంటే దాదాపు 43 తక్కువ విలువకు జొమాటొ కొనుగోలు చేసిందన్నమాట. రెండేళ్ళ నుంచి ఈ కంపెనీ టేకోవర్ గురించి జొమాటొ ఆలోచిస్తోంది. గత ఏడాది జొమాటొతోపాటు టైగర్‌ గ్లోబల్‌ ఇందులో పెట్టుబడి పెట్టాయి. షేర్ల నిష్పత్తి గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.