కోలుకున్నా… నష్టాల్లోనే
అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఒకదశలో ప్రధాన సూచీలు ఒకశాతంపైగా నష్టపోయాయి. తరవాత కోలుకున్నాయి. ఇపుడు నాస్డాక్ 0.36 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.54 శాతం, డౌజోన్స్ 0.72 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. జూన్ ద్రవ్యోల్బణం 9.1 శాతంగా అమెరికా గణాంక విభాగం వెల్లడిచింది. బహుశా 40 ఏళ్ళలో కొత్త రికార్డు ఇది. ఇకే నెలలో 1.5 శాతంపైగా ఈ సూచీ పెరిగింది. మరిదీని ప్రభావం మార్కెట్‌పై ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే మార్కెట్ విశ్లేషకులను మించి ద్రవ్యోల్బణ రేటు రావడంతో ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు ఎలా ఉంటుందో చూడాలి. యూరప్ మార్కెట్లు 0.75 శాతం నుంచి ఒక శాతం లోపు నష్టాలతో ముగిశాయి. డాలర్ ఇండెక్స్ 108పైనే ఉంది. బ్రెంట్ క్రూడ్ 100 డాలర్ల వద్ద ఉంది. ఇక బంగారం, వెండి స్వల్పంగా పెరిగాయి.