For Money

Business News

2023లో జీడీపీ వృద్ధి రేటు 4.7 శాతమే!

వచ్చే ఏడాది భారత స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును జపాన్‌కు చెందిన రేటింగ్‌ సంస్థ నొమురా తగ్గించింది. ఇంతకుమునుపు భారత జీడీపీ వృద్ధి రేటు 5.4 శాతం ఉంటుందని అంచనా వేసిన ఈ సంస్థ… భారత్‌దేశంలో ముడి పదార్థాల వ్యయం అధిక స్థాయిలోనే కొనసాగే అవకాశముందని అభిప్రాయపడింది. దీంతో అధిక ద్రవ్యోల్బణంతో వృద్ధి రేటు మందగిస్తుందని పేర్కొంది. ఎగుమతులు పెరగడం లేదని, దిగుమతులు మాత్రం భారీగా పెరుగుతుండటం వల్ల వాణిజ్య లోటు చాలా పెరుగుతుందని, దీనికి తోడు అధిక ద్రవ్యోల్బణం, ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడుల లేకపోవడం, విద్యుత్ సంక్షోభం, ఇదే సమయంలో అంతర్జాతీయంగా కూడా పెద్ద వృద్ధి ఉండకపోవడం వల్ల భారత జీడీపీ వృద్ధి రేటు తగ్గుతుందని నొమురా పేర్కొంది. 2022లో వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం ఉండొచ్చని, వచ్చే ఏడాది మాత్రం 4.7 శాతం మాత్రమే ఉంటుందని అంచనా వేసింది. ఈ ఏడాది రెపోటు రేటు 5.75 శాతానికి, వచ్చే ఏడాది ఆరు శాతానికి చేరుతుందని పేర్కొంది. ఈ ఏడాది డాలర్‌తో రూపాయి మారకం రేటు 83కు చేరే అవకాశముందని తెలిపింది.