For Money

Business News

నష్టాల్లో ఈక్విటీ మార్కెట్లు

కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ దూసుకుపోతోంది. ఇవాళ కూడా అరశాతంపైగా పెరిగింది. డాలర్‌ ఇండెక్స్‌ 105పైన ట్రేడవుతోంది. ఇవాళ బాండ్‌ ఈల్డ్స్‌ బాగా తగ్గాయి. అయినా వాల్‌స్ట్రీట్‌ నష్టాల్లో కొనసాగుతోంది. మూడు సూచీలు 0.2 శాతం నుంచి 0.3 శాతం మధ్య నష్టంతో ఉన్నాయి. నామ మాత్రపు నష్టాలే కావడంతో మార్కెట్‌ లాభాల్లోకి వస్తుందేమో చూడాలి. మరోవైపు డాలర్‌తో పాటు క్రూడ్‌ ఆయిల్ భారీగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్‌ 2.5 శాతం పెరగడంతో ధర 111.5 డాలర్లను దాటింది. ఇక బులియన్‌ భారీ ఒత్తిడి కన్సిస్తోంది. బంగారం స్వల్పంగా తగ్గినా.. టెక్నికల్‌గా చాలా కీలకమైన 1800 డాలర్లకు దిగువకు పడిపోయింది. మరోవైపు వెండి భారీగా మూడు శాతంపైగా క్షీణించి 20 డాలర్ల దిగువకు పడిపోయింది.