For Money

Business News

తగ్గినా… నష్టాలు తప్పలేదు

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ప్రభావం క్రమంగా అన్ని దేశాలకు పాకుతోంది. ముఖ్యంగా రష్యన్‌ రూబుల్‌ చెత్త కాగితంలా మారడం, చమురు ధరలు ఆకాశాన్నంటడంతో పాటు డాలర్‌ పెరగడతో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. నిత్యావసర వస్తువుల నుంచి విలా వస్తువుల వరకు అన్నిరకాల వస్తుల ధరలు పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో డౌన్‌ట్రెండ్‌ కొనసాగుతోంది. నిన్న వాల్‌స్ట్రీట్‌ భారీ నష్టాల్లోకి జారినా… క్లోజింగ్‌ కల్లా స్వల్పంగా కోలుకుంది. డౌజోన్స్‌ 0.29 శాతం, ఎస్‌ అండ్ పీ 500 సూచీ 0.5 శాతం నష్టపోగా… నాస్‌డాక్‌ 1.5 శాతం క్షీణించింది. అమెరికా మార్కెట్లు ముగిసిన తరవాత కూడా ఫ్యూచర్స్‌లో నష్టాలు కొనసాగుతున్నాయి. ఎస్‌ అండ్‌ పీ 500 ప్యూచర్స్‌ సూచీ ఒక శాతంపైగా నష్టపోయింది.