వాల్‌స్ట్రీట్ డౌన్… డాలర్, క్రూడ్ అప్
డేంజరస్ కాంబినేషన్. డాలర్ పడినపుడు క్రూడ్ తగ్గడం ఆనవాయితీ. కాని డాలర్ ఇండెక్స్ 0.25 శాతం పెరిగితే బ్రెంట్ క్రూడ్ 1శాతం దాకా పెరిగింది. బ్యారెల్ క్రూడ్ ధర 85.25 డాలర్లకు చేరింది. వరుసగా నాలుగో వారం క్రూడ్ లాభాల్లో ముగుస్తోంది. ఇక వాల్‌స్ట్రీట్ నష్టాల్లో ఉంది. నిన్న భారీగా క్షీణించిన నాస్డాక్ ఇవాళ కాస్సేపు గ్రీన్‌లో ఉన్నా… వెంటనే నష్టాల్లోకి వెళ్ళింది. ఇక డౌజోన్స్ 0.8 శాతం నష్టపోయింది. సిటీ బ్యాంక్‌తో పాటు పలు బ్యాంకుల ఫలితాలు నిరాశాజనకంగా ఉండటమే దీనికి కారణం. ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 0.4 శాతం నష్టంతో ఉంది. బులియన్ రెడ్‌లోఉన్నా బంగారం కన్నా వెండి బాగా పడింది.