నష్టాల్లో మూడు సూచీలు
వాల్‌స్ట్రీట్ ఇవాళ నష్టాల్లో ఉంది. నాస్డాక్, ఎస్ అండ్ పీ 500, డౌ జోన్స్… మూడు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నాస్డాక్ అరశాతంపైగా నష్టంతో ఉండగా, డౌజోన్స్ 0.3 శాతం నష్టంతో ఉంది. ఎస్ అండ్ పీ 500లోని 11 రంగాల షేర్లలో 9 రంగాల షేర్లు తగ్గాయి. యాపిల్, అమెజాన్ ఒక శాతం క్షీణించగా, చైనా కార్ల అమ్మకాలు బాగుతున్నాయని కంపెనీ ప్రకటించడంతో టెస్లా నాలుగు శాతం పెరిగింది. పదేళ్ళ అమెరికా బాండ్ ఈల్డ్స్ ఇవాళ మూడు శాతంపైగా పెరిగింది. దీంతో గ్రోత్ స్టాక్స్‌లో ఒత్తిడి పెరిగింది. అలాగే డాలర్ కూడా ఇవాళ 0.5 శాతం పెరిగింది. డాలర్ ఇండెక్స్ మళ్ళీ 103ని దాటింది. క్రూడ్ ఆయిల్ తగ్గినా 123 డాలర్లపైనే ఉంటోంది.