నష్టాల్లో వాల్‌స్ట్రీట్
యూరప్ మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నా… అమెరకా మార్కెట్లు ఇవాళ చల్లబడ్డాయి. నిన్న భారీ లాభాల తరవాత ఇవాళ సూచీలు నామమాత్రపు నష్టాలతో ట్రేడవుతున్నాయి. డౌజోన్స్ స్థిరంగా ఉన్నా నాస్డాక్ అరశాతం నష్టపోయింది. ఇక ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 0.3 శాతం నష్టంతో ఉంది. ఇవాళ కరెన్సీ మార్కెట్లో డాలర్ కూడా స్వల్పంగా క్షీణించింది. తాజా సమాచారం మేరకు డాలర్ ఇండెక్స్ 0.13 శాతం నష్టంతో 96.41 వద్ద ట్రేడవుతోంది. క్రూడ్ ఆయిల్ కూడా స్వల్పంగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ 89.31 డాలర్ల వద్ద, WTI క్రూడ్ 88.20 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బులియన్ మాత్రం గ్రీన్‌లో ఉంది. ఔన్స్ బంగారం ధర మళ్ళీ 1800 డాలర్లను దాటి 1802 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి 2.5 శాతం లాభంతో 22.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.