For Money

Business News

దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి: కేసీఆర్‌

దేశ రాజ్యాంగానికి అనేక సవరణలు చేశారని… కాని ఇపుడు దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపాదించారు. కొత్త రాజ్యాంగంపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజ్యాంగం ఏర్పడినపుడు మనది సమాఖ్య దేశమని.. అనేక రంగాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉండేవని… కాని కాలక్రమంలో రాష్ట్ర అధికారాలను రాష్ట్రాల నుంచి కేంద్రం లాక్కొందని ఆయన ఆరోపించారు. వన్ నేషన్‌, వన్‌ రిజిస్ట్రేషన్‌ అనడంలో అర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఐఏఎస్‌ అధికారులను కేంద్రం ఏకపక్షంగా తీసుకోవడమే తాజా ఉదాహరణ అని ఆయన అన్నారు. కేంద్రం పూర్తిగా అప్రజాస్వామ్య పద్ధతిలో వెళుతోందని ఆయన అన్నారు.