వొడాఫోన్ నికర నష్టం తగ్గింది
మార్చితో ముగిసిన త్రైమాసికంలో వోడాఫోన్ ఐడియా నికర నష్టం గత ఏడాది కాలంతో పోలిస్తే తగ్గింది.గత ఏడాది మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో వోడాఫోన్ ఐడియా నికర నష్టం రూ.7023 కోట్లు కాగా, ఈసారి రూ.6563 కోట్లకు తగ్గింది. అలాగే ఆదాయం కూడా రూ. 9647 కోట్ల నుంచి రూ. 10240 కోట్లకు పెరిగింది. ARPU (Average Revenue Per User) రూ. 115 నుంచి రూ. 124కు పెరగడం కూడా పెద్ద విశేషమే. టారిఫ్ పెంచినా… 4జీ సబ్స్క్రయిబర్ బేస్ పెరిగిందని కంపెనీ పేర్కొంది. ప్రిఫరెన్షియల్ ఈక్విటీ కింద ప్రమోటర్ల నుంచి రూ. 4500 కోట్లను సమీకరించడం పూర్తయిందని కంపెనీ పేర్కొంది.మరో విడత నిధుల సమీకరణ కోసం తాము ప్రయత్నాలు మొదలు పెట్టామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రవీందర్ టక్కర్ తెలిపారు. కంపెనీ రుణాలు సుమారు రూ.1.96 లక్షల కోట్లకు చేరాయి.