30 శాతం పెరిగిన వోడాఫోన్ షేర్
టెలికాం రంగానికి ముఖ్యంగా ఏజీఆర్ వాయిదాల చెల్లింపుపై నాలుగేళ్ళ మారటోరియం విధించడంతో ఇవాల వొడాఫోన్ ఐడియా షేర్ 30 శాతం పెరిగి రూ.11.50కి చేరింది. ఇపుడు 26 శాతం లాభంతో రూ. 11.30 వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్‌తో పాటు ఈ కంపెనీకి రుణాలు ఇచ్చిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు కూడా భారీ లాభాలు పొందాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఒకదశలో పది శాతం దాకా పెరిగి రూ. 51.15కి చేరగా, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్ 14 శాతం దాకా పెరిగి రూ. 1186లను తాకింది. ప్రస్తుతం 7 శాతం తగ్గి రూ. 1125 వద్ద ట్రేడవుతోంది.