For Money

Business News

దగ్గు మందు తాగి 18 మంది పిల్లల మృతి

మొన్న గాంబియా… ఇపుడు ఉజ్బెకిస్తాన్‌. భారత్‌కు చెందిన ఓ కంపెనీ దగ్గు మంది తాగి తమ దేశంలో 18 మంది పిల్లలు మృతి చెందినట్లు ఉజ్బెకిస్తాన్‌ ఆరోపించింది. నొయిడాకు చెందిన మారియన్‌ బయోటిక్‌ కంపెనీ తయారు చేసిన డాక్‌ -1 మ్యాక్స్‌ (Dok -1 Max) దగ్గు మంది తాగడం వల్ల 18 మంది పిల్లలు మృతి చెందినట్లు ఆ దేశానికి చెందిన AKI.com అనే వెబ్‌సైట్‌ పేర్కొంది. ఈ బ్రాండ్‌ సిరప్‌, ట్యాబ్లెట్ల అమ్మినట్లు తెలుస్తోంది. ఈ బందులో ఎథిలిన్‌ గ్లైకాల్ ఉన్నట్లు శాంపిల్స్‌లో బయటపడింది. ఎథిలైన్‌ గ్లైకాల్‌… పారిశ్రామిక అవసరాల కోసం వాడే గ్లిసరిన్‌లో ఉంటుంది. ఇది కేవలం పరిశ్రమల్లో వాడుతారు. మందుగా మనుషుల కోసం వాడటం నిషిద్ధం. దీనిపై భారత ఆరోగ్య శాఖ స్పందించాల్సి ఉంది. అలాగే నొయిడాలోని మారియన్‌ బయోటెక్‌ కంపెనీకి మీడియా పంపిన ఈ మెయిల్‌కు ఇంకా సమాధానం రాలేదని బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక పేర్కొంది. మారియన్‌ బయోటెక్‌కు నొయిడాలోనే తయారీ కేంద్రం ఉంది. ఈ ఔషదాన్ని భారత మార్కెట్‌లో కూడా ఈ కంపెనీ విక్రయిస్తోంది.