For Money

Business News

ఇన్ఫోసిస్‌, విప్రో, టీసీఎస్‌పై సస్పెన్షన్‌

హెచ్‌-1బీ వీసా కార్డు విధానాన్ని దుర్వినియోగం చేశారంటూ మైక్రోసాఫ్ట్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, విప్రో, కాగ్నిజెంట్‌ కంపెనీలను గ్రీన్‌ కార్డ్‌ ప్రొగ్రామ్‌ నుంచి అమెరికా సస్పెండ్‌ చేసింది. వీటితో పాటు సస్పెన్షన్‌ పడిన కంపెనీల్లో క్యాప్‌జెమినీ, హెచ్‌సీఎల్‌, అడోబ్‌ సంస్థలు కూడా ఉన్నాయి. అమెరికా తాజా నిర్ణయంతో ఇక నుంచి ఈ కంపెనీల తరఫున హెచ్‌-1బీ వీసాకు దరఖాస్తు చేసుకోవడం కుదరదు. వాషింగ్టన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ వెల్లడించారు. హెచ్‌-1బీ వీసా కార్డు విధానాన్ని దుర్వినియోగంపై వివిధ దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతారని కార్మికశాఖ మంత్రి కీత్‌ సాండర్లింగ్‌ వెల్లడించారు.శాశ్వత నివాసంతో విదేశీ కార్మికులను హెచ్‌వన్‌ బీ వీసా కింద కంపెనీలు విదేశీయులను స్సాన్సర్‌ చేస్తాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలు 2009 నుంచి హెచ్‌వన్‌ బీ విధానా్ని దుర్వినియోగం చేసినట్లు అమెరికా ఆరోపిస్తోంది. అమెరికాకు చెందాల్సిన లక్షలాది ఉద్యోగాలను తప్పుడు మార్గాల ద్వారా విదేశీయులు పొందినట్లు అమెరికా ఆరోపిస్తోంది.

https://x.com/MattooShashank/status/2108213129607852248?s=20

Leave a Reply