52 వారాల కనిష్ఠానికి….
భయపడినంతా జరిగింది. నిఫ్టి 52 వారాల కనిష్టాన్ని బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు ఇరాన్ యుద్ధం తరవాత నమోదైన 22,186 కనిష్టస్థాయిగా నిలిచింది. ఈ ఏడాది జనవరిలో నమోదైన స్థాయి నుంచి నిఫ్టి ఏకంగా 4000 పాయింట్లు కోల్పోయింది. ఇవాళ 22189 పాయింట్లను తాకింది. 2025 ఏప్రిల్ 18వ తేదీ తరవాత అంటే 18 నెలల కనిష్ఠానికి నిఫ్టి పడిపోయింది. చివరల్లో స్వల్పంగా కోలుకుని 22,216 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 387 పాయిట్లు నష్టపోయింది. ఇవాళ ఐటీ రంగం మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. ఒక్క ఐటీ రంగానికి చెందిన కొన్ని షేర్లు మాత్రం నామమాత్రపు లాభాలతో ముగిశాయి. ఇవాళ అదానీ గ్రూప్‌నకు చెందిన షేర్లు భారీ నష్టాలతో ముగిశాయి. దీనికి కారణం ఇవాళ ఐటీసీలో జరిగిన బ్లాక్ డీల్. జీక్యూజీ అనే విదేశీ ఇన్వెస్టర్ ఇవాళ ఐటీసీలో రూ. 9500 కోట్ల షేర్లను అమ్మారు. ఇదే విదేశీ ఇన్వెస్టర్‌కు అదానీ గ్రూప్ కంపెనీల్లో వాటా ఉంది. ఇప్పటికే కొన్ని కంపెనీల్లో ఈ విదేశీ ఇన్వెస్టర్ అమ్మినట్లు తెలుస్తోంది. మిగిలిన వాటా కూడా అమ్మే ఛాన్స్ ఉందన్న భయం మార్కెట్లో ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టి కూడా బాగా నష్టపోయింది. పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్ మినహా మిగిలిన సూచీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇవాళ 1.5 శాతం క్షీణించి రూ.692 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టిలో ఎస్ బ్యాంక్ 1.97 శాతం నష్టపోయింది.
