అదానీ షేర్లలో అమ్మకాల హోరు
హెండెల్ బర్గ్ రీసెర్చి రిపోర్ట్ సృష్టించిన కలకలం తరవాత తొలిసారి అదానీ గ్రూప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఈ వారం మొత్తంగా అదానీ షేర్లలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే అదానీ ఎంటర్ ప్రైజస్ 7 శాతం నష్టంతో నిఫ్టి టాప్ లూజర్‌గా నిలిచింది. అదానీ పోర్ట్స్ నాలుగు శాతం, అదానీ గ్రీన్ 8 శాతం, అదానీ ఎనర్జి 5 శాతం, అదానీ పవర్ షేరు 5 శాతం చొప్పున నష్టంతో ట్రేడవుతున్నాయి. అంబుజా సిమెంట్, అదానీ టోటల్, ఏసీసీ, ఎన్‌డీటీవీ, ఓరియంట్ సిమెంట్ షేర్లు కూడా రెండు నుంచి మూడు శాతం దాకా నష్టంతో ట్రేడవుతున్నాయి. జెఫరీస్ వంటి ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు సిఫారసు చేసిన షేర్లను కూడా ఇన్వెస్టర్లు తెగ అమ్మడం విశేషం. రానున్న అయిదు నెలల్లో అదానీ ఎనర్జి సొల్యూషన్స్ షేర్ భారీగా పెరుగుతుందని జెఫరీస్ పేర్కొంది. ఈ షేర్‌తో పాటు JSW ఎనర్జి, ఎన్‌టీపీసీ షేర్లను కూడా జెఫరీస్ సిఫారసు చేసింది.
