For Money

Business News

నెలలో కోటి 30 లక్షల ఉద్యోగాలు ఫట్‌

మే నెలలో దేశంలో భారీగా ఉద్యోగాలు పోయాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉద్యోగాలు పోయినట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమి (CMIE) పేర్కొంది. దీంతో మే జూన్‌ నెలలో దేశంలో నిరుద్యోగ రేటు 7.8 శాతానికి చేరింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు పోయినట్లు CMIE పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో మే నెలలో నిరుద్యోగ రేటు 6.62 శాతం ఉండగా, జూన్‌ నెలలో 8.03 శాతానికి పెరిగినట్లు తెలిపింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 7.12 శాతం నుంచి7.3 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. లాక్‌డౌన్‌ వంటివి లేని సమయంలో ఈ స్థాయిలో ఉద్యోగాలు పోవడం ఇదే అత్యధికమని CMIE మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహేష్‌ వ్యాస్‌ అన్నారు. అయితే ఇది పూర్తిగా వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశమని.. జూన్‌లో వ్యవసాయ పనులు చాలా తక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.