For Money

Business News

500 మంది ఉద్యోగులు ఔట్‌?

అధిక వడ్డీ ప్రభావం కంపెనీలపై పడుతోంది. అనేక కంపెనీలు వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా భారీగా రుణాలు ఉన్న కంపెనీలు వెంటనే స్పందిస్తున్నాయి. తాజాగా ఓలా కంపెనీ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా 500 మంది సిబ్బందిని తీసేయనుంది. ఇప్పటికే క్విక్‌ కామర్స్‌ సేవలకు గుడ్‌బై పలికిన ఓలా..తాజాగా ఓలా డ్యాష్‌ సేవలను కూడా నిలిపివేసింది. కారు వ్యాపారంపై మరింత దృష్టి సారించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ డివిజన్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఓలా అంటోంది. అన్ని విభాగాల్లో 1,000-1,100 మందిని తొలగించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై కంపెనీ వర్గాలు స్పందించడానికి నిరాకరించారు.