ఇండియాలో బ్లూటిక్ ధర ఇదే…
భారత దేశంలో బ్లూ టిక్ ధరను ట్విటర్ వెల్లడించింది. ఐఫోన్ వినియోగదారులు నెలకు రూ. 999 చెల్లించాల్సి ఉంటుంది. యాప్ స్టోర్ నుంచి ఈ సర్వీస్‌ను పొందవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లకు ఇంకా ధర ప్రకటించలేదు. ఎందుకంటే తొలుత ఈ సర్వీస్‌ను వెబ్, ఐఫోన్ (iOS) వెర్షన్లకు ట్విటర్ అందిస్తోంది. ఇది టెస్టింగ్ ప్రక్రియ. ఆండ్రాయిడ్ ఫోన్ల సంఖ్య చాలా ఎక్కువ కాబట్టి. తొలుత వెబ్, ఐఫోన్లలో టెస్ట్ చేసిన తరవాత ట్విటర్ ఆండ్రాయిడ్ ధరను వెల్లడించే అవకాశముంది. తొలుత భారత్‌లో బ్లూటిక్ ధర రూ. 719గా ప్రకటించింద. ఆ తరవాత యాప్ స్టోర్ ద్వారా అమ్మితే యాపిల్ కంపెనీకి 30 శాతం కమీషన్ ఇవ్వాల్సి ఉన్నందున ధరను రూ. 999గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఆండ్రాయిడ్ ఫోన్లకు నెలకు 8 డాలర్లు, ఐఫోన్లకు 11 డాలర్లను వసూలు చేస్తోంది. బ్లూ వెరిఫికేషన్ తీసుకున్నవారికి కొన్ని అదనపు ప్రయోజనాలను ట్విటర్ అందిస్తున్న విషయం తెలిసిందే.