For Money

Business News

తగ్గిన రీటైల్‌ ధరలు

రీటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో దిగివచ్చింది. ఈ ఏడాది తొలిసారి 6 శాతం కంటే దిగువన నమోదైంది.
వినియోగదారుల ధరల సూచీ (Consumer Price Index – CPI) ఆధారంగా గణించే రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 5.88 శాతంగా నమోదైంది. ఇది 11 నెలల కనిష్టం. అక్టోబర్‌లో ఇది 6.77 శాతం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిర్దేశించుకున్న 6శాతం లక్ష్యం దిగువకు ఈ ఏడాది తొలిసారిగా వచ్చింది. నిత్యావసర సరుకులు, కూరగాయలతో పాటు మరిన్ని ఆహార పదార్థాల ధరల తగ్గుదల కారణంగానే ఈ సూచీ తగ్గింది. మరోవైపు, నవంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం కూడా 4.67 శాతానికి దిగివచ్చింది. అంతకు ముందు నెలలో 7.01 శాతంగా ఉంది.