For Money

Business News

రేంజ్​ రోవర్​స్పోర్ట్​ రెడీ

దేశంలో కొత్త రేంజ్​ రోవర్​ స్పోర్ట్ మోడల్​ డెలివరీని ప్రారంభించినట్టు జాగ్వర్​ లాండ్​ రోవర్​ సంస్థ ప్రకటించింది. టాటా మోటార్స్‌ అనుబంధంగా ఉన్న ఈ కంపెనీ డైనమిక్​ ఎస్ఈ, డైనమిక్​ హెచ్​ఎస్ఈ, ఆటోబయోగ్రఫి, ఫస్ట్​ ఎడిషన్​ వేరియంట్లలో మోడల్‌ను అందుబాటులో తెచ్చింది. ఫస్ట్​ ఎడిషన్​ కేవలం ఒక ఏడాది మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.
దేశంలోని 21 నగరాల్లో.. లాండ్​ రోవర్‌కు 25 అధికారిక ఔట్​లెట్​లు ఉన్నాయి. వీటిల్లోంచి ఈ మోడల్‌ను విక్రయిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. డీ350 డైనమిక్​ ఎస్ఈ మోడల్‌ ధర రూ. 1.64కోట్లు కాగా, పీ400 డైనమిక్​ హెచ్ఎస్ఈ ధర రూ. 1.68కోట్లుగా కంపెనీ పేర్కొంది. డీ350 డైనమిక్​ హెచ్ఎస్ఈ ధర రూ. 1.71కోట్లు కాగా … డీ350 ఆటోబయోగ్రఫి మోడల్‌ రూ. 1.81కోట్లకు లభిస్తోంది. డీ350 ఫస్ట్​ ఎడిషన్​ ధర రూ.1.84కోట్లుగా కంపెనీ పేర్కొంది. ఇవన్నీ ఎక్స్​షోరూం ధరలు.