For Money

Business News

రూ. 55,550ను తాకనున్న బంగారం

రేపు అమెరికా ద్రవ్యోల్బణం డేటా రానుంది. బుధవారం ఫెడ్‌ వడ్డీ నిర్ణయం వెలువడనుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి బులియన్‌పై పడింది. ఇవాళ అమెరికా మార్కెట్‌లో 1810 డాలర్లను తాకిన ఔన్స్‌ బంగారం ధర ఇపుడు 1800 డాలర్ల దిగువకు వచ్చింది. టెక్నికల్‌గా చూస్తే బంగారం ఇపుడు 200 రోజుల చలన సగటుకు సమీపంలో ఉంది. డిసెంబర్‌ 1వ తేదీ తరవాత రెండోసారి డిసెంబర్‌ 7న ఈ స్థాయిని బంగారం దాటింది. ఇవాళ కూడా 200 రోజుల చలన సగటుకు దిగువకు పడినా.. వెంటనే కోలుకుంది. టెక్నికల్‌గా చూస్తే రెండు రకాల వ్యూహాలు మార్కెట్‌లో ఉన్నాయని టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. ఒక వేళ బంగారం ఇంకా పడితే 1790 డాలనకల ప్రాంతంలో కొనమని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. 1780 డాలర్లు స్టాప్‌లాస్‌ కాగా, టార్గెట్‌ 1820 డాలర్లుగా చెబుతున్నారు. ఇక రేంజ్‌ బౌండ్‌ బ్రేకౌట్‌ వస్తే అంటే బంగారం 1815 డాలర్ల వద్ద నిలబడితే 1810 డాలర్ల స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఇక్కడ గనుక మద్దతు లభిస్తే బంగారం కచ్చితంగా 1,865 డాలర్లను తాకుందని అంటున్నారు. కాబట్టి అమెరికా మార్కెట్‌లో బంగారం దూకుడు చూసి… ఇక్కడ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఇవాళ ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి ఫ్యూచర్స్‌ పది గ్రాముల బంగారం రూ. 54,187 వద్ద ట్రేడవుతోంది. దిగువ స్థాయిలో ఏ కాస్త మద్దతు లభించినా వెంటనే రూ. 55,550ని తాకే అవకాశముంది. రూ. 53,500పైన ఉన్నంత వరకు అప్‌ట్రెండ్‌లో కొత్త గరిష్ఠాల కోసం ఎదురు చూడొచ్చు. ఇక వెండి కూడా రూ. 71,000 మార్క్‌ను అందుకోవచ్చు. రూ. 67500 పైన ఉన్నంత వరకు వెండి కొత్త గరిష్ఠ స్థాయిలను తాకవచ్చు. సో… అమెరికా మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం 1815 డాలర్లు దాటే వరకు వెయిట్‌ చేయండి.