For Money

Business News

హైదరాబాద్‌లో అడోబ్‌ పెట్టుబడులు

కృత్రిమ మేధ సొల్యూషన్స్‌ సెంటర్‌ను అడోబ్‌ హైదరాబాద్‌లో పెట్టబోతోందని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద అడోబ్ క్యాంపస్ కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. స్టార్టప్‌లకు హైదరాబాద్ సొంతగడ్డగా మారిందన్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థాపక శిఖరాగ్ర సదస్సు అయిన టై (టిఐఇ) గ్లోబల్ సమ్మిట్ సదస్సు నగరంలోని హైటెక్స్‌లో సోమవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్‌ను నిన్న మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…భారతీయ పారిశ్రామికవేత్తల ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే తాము లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎనిమిదిన్నర ఏళ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించిందన్నారు. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తెలంగాణ గమ్యస్థానమన్నారు. ప్రయివేట్ రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపిన స్టార్టప్ టి.. హబ్ కి చెందినదేనన్నారు. రాష్ట్రంలో ఐటి, పారిశ్రామిక రంగాన్నికి చేయూత నివ్వడంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎవరు సాటిలేరన్నారు. ఈ సదస్సులో ప్రధానంగా ప్రపంచ వ్యవస్థాపక అభివృద్ధిపై చర్చిస్తారు. దేశ, విదేశాలకు చెందిన సుమారు 2,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 150 మంది అంతర్జాతీయ స్పీకర్లు, 200కు పైగా పెట్టుబడుదారులు పాల్గొన్నారు.