For Money

Business News

ఆర్‌ఆర్‌ఆర్‌కు గోల్డన్‌ గ్లోబ్స్‌ నామినేషన్స్‌

హాలివుడ్‌లో ఆస్కార్‌ తరవాత అంతటి ప్రతిష్ఠ గల అవార్డులు.. గోల్డన్‌ గ్లోబ్స్‌ అవార్డులు. 2023 ఏడాదికి గోల్డన్‌ గ్లోబ్స్‌ అవార్డుల కోసం నామినేషన్స్‌ను ప్రకటించారు. వాటిలో రెండు కేటగిరీలలో ఆర్‌ఆర్‌ఆర్‌కు నామినేషన్స్‌ దక్కాయి. మోషన్‌ పిక్చర్‌- ఫారిన్‌ లాంగ్వేజ్‌ కేటగిరిలో ఆర్‌ఆర్‌ఆర్‌ నామినేషన్‌ దక్కగా… ఈ సినిమాలో నాటు నాటు పాటకు సంగీతం సమకూర్చిన ఎంఎం కీరవాణికి మోషన్‌ పక్చర్‌ – ఒరిజినల్‌ స్కోర్‌ కేటగిరిలో నామినేషన్‌ దక్కింది. ఒక్కో కేటగిరికి అయిదు చిత్రాలను నామినేట్‌ చేశారు. ఫారిన్‌ కేటగిరిలో ఆర్‌ఆర్‌ఆర్‌కు పోటీగా ఆల్ క్వయిట్‌ ఆన్‌ ద వెస్టర్న్‌ ఫ్రంట్‌ (జర్మనీ), అర్జంటైనా 1985 (అర్జంటైనా), క్లోజ్‌ (బెల్జియం), డెసిషన్‌ టు లవ్‌ (దక్షిణ కొరియా) చిత్రాలు ఉన్నాయి.