For Money

Business News

షియోమి డెస్క్‌ టాప్‌ పీసీ ఇదే

చైనాకు చెందిన షియోమి కొత్త స్మార్ట్‌ఫోన్‌ల గురించి ప్రకటన చేసింది. షియోమి 13 పేరుతో ఐఫోన్‌ మాదిరి ఫోన్స్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. అలాగే షియోమి మిని పీసీని కూడా తీసుకురానుంది. ఇది అచ్చం యాపిల్ మ్యాక్ బుక్ మాదిరి ఉంది. 437 గ్రాములు ఉన్న పీసీ ప్రస్తుతం చైనా మార్కెట్‌లో లభిస్తోంది. స్థానిక మార్కెట్‌ కోసం దీన్ని చైనా భాషలోనే తెచ్చారు. దీని ధర మన కరెన్సీలో రూ. 47365. అదే ఇంటర్నల్‌ స్టోరేజీ లేని మోడల్‌ రూ. 35,508లకు విక్రయిస్తున్నారు.
ఇంటెల్‌తో ప్రత్యేక ఒప్పందంతో దీన్ని అభివృద్ధి చేసినట్లు షియోమీ పేర్కొంది. 12వ జనరేషన్‌ ఇంటెల్‌కోర్ ఐ5 -1240పీ ప్రాసెసర్‌, 12 కోర్‌ ,16 థ్రెడ్‌ సీపీయూతో దీన్ని అభివృద్ధి చేశారు.