For Money

Business News

నష్టాల నుంచి కోలుకుని… స్థిరంగా

మార్కెట్‌ దిగువ స్థాయి నుంచి విజయవంతంగా కోలుకుంది. నిఫ్టికి 15500 లేదా 15400 స్థాయి అత్యంత కీలకం. ఉదయం కూడా అనలిస్టులు నిఫ్టి 18400 దిగువన క్లోజ్‌ అయితేనే షార్ట్‌ చేయమని సలహా ఇచ్చారు. కాని క్లోజింగ్‌లోనిఫ్టి పూర్తిగా నష్టాల నుంచి కోలుకుని 18497 వద్ద ముగిసింది. ఒకదశలో నిఫ్టి 18521ని కూడా తాకింది. ఐటీ, పెయింట్‌ కంపెనీలలో కాస్త ఒత్తిడి వచ్చినా… ఆయిల్‌ మార్కెటింగ్‌, ఎఫ్‌ఎంసీజీ షేర్లు నిఫ్టి లాక్కొచ్చాయి. పైగా సిమెంట్‌ షేర్లు కూడా పటిష్ఠంగా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకు షేర్లు తమ నష్టాలన్నీ పూడ్చుకుని గ్రీన్‌లోకి రావడంతో నిఫ్టి ఈజీగా కోలుకుంది. మిడ్‌ సెషన్‌లో యూరో మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. దీంతో నిఫ్టి 18345ని తాకింది. అయితే నష్టాల నుంచి యూరో మార్కెట్లు కోలుకోవడం ప్రారంభించడంతో పాటు అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లోకి రావడంతో నిఫ్టి కూడా స్థిరంగా ముగిసింది. స్థానిక కంపెనీల్లో దివీస్‌ ల్యాబ్‌ ఇవాళ రెండు శాతం దాకా పెరగడం విశేషం. నిఫ్టి టాప్‌ గెయినర్‌గా బీపీసీఎల్‌ నిలిచింది. చాలా మంది అనలిస్టులు ఇపుడు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలను సిఫారసు చేస్తున్నారు. అన్నింటికన్నా విశేషం ఎల్‌ఐసీ షేర్‌ ఇవాళ 4 శాతంపైగా పెరిగి రూ. 700 దాటడం. విమానాశ్రయాలన్నీ కిటకిటలాడున్నాయి. దీంతో ఇండిగో షేర్‌ ఇవాళ మూడు శాతంపైగా పెరిగింది. గోద్రెజ్‌ కన్జూమర్‌, పేటీఎం షేర్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం అనలిస్టులు అనుమానించినట్లే డిక్సన్‌ రెండున్నర శాతం క్షీణించింది. లారస్‌ ల్యాబ్‌ మరో 2 శాతం క్షీణించింది. ఇపుడు ఈ షేర్‌ రూ.404 వద్ద ఉంది. మిడ్‌ క్యాప్‌ బ్యాంక్‌ షేర్లలో పీఎన్‌బీ జోరు కొనసాగుతోంది. ఇవాళ ఈ షేర్‌ 58కి చేరింది. ఇవాళ ఓ బ్రోకింగ్‌ సంస్థ ఈ షేర్‌ టార్గెట్‌ ధర రూ. 34 నుంచి రూ. 72కు పెంచింది.