ఏప్రిల్ ఫూల్ చేసిన ట్రంప్
తిక్కలోడు ట్రంప్… అని ఊరికే అన్లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలకు ప్రపంచ ప్రజలు భారీ మూల్యం చెల్లిస్తున్నారు. ఇరాన్ ఆయిల్‌పై కన్నేసిన ట్రంప్…ఇపుడు ఫ్లేటు ఫిరాయించారు. నిన్న కూడా ఇరాన్ వద్ద అణు పదార్థాలు లేవని చెప్పని ట్రంప్… ఇవాళ ఇరాన్ అణుసామర్థ్యం గురించి మాట్లాడారు. రెండు మూడు వారాల్లోయుద్ధం ముగిస్తామని, ఇరాన్‌తో శాంతి ఒప్పందం జరిగినా, జరగకపోయినా యుద్ధాన్ని ఆపేస్తామని చెప్పిన ట్రంప్… ఇవాళ ఇరాన్‌పై భీకర యుద్ధం చేస్తామని హెచ్చరించారు. దీంతో నిన్న ఆయన ప్రపంచ ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేశారు. ఆయన మాటలు విన్న నిన్న భారీగా పెరిగిన ఈక్విటీ మార్కెట్లు ఇవాళ మళ్ళీ ఢమాల్ అంటున్నాయి. మళ్ళీ క్రూడ్ ఆయిల్ పెరిగింది. అయిదు శాతంపైగా పెరిగి 106 డాలర్లకు బ్రెంట్ క్రూడ్ చేరింది. నిన్న రాత్రి నాస్‌డాక్ ఒక శాతం పెరిగింది. ఇపుడు నాస్‌డాక్ ఫ్యూచర్స్ ఒక శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిన్న పెరిగిన దానికన్నా అధిక నష్టాలతో గిఫ్ట్ నిఫ్టి ఉంది. ప్రపంచ మార్కెట్లన్నీ ట్రంప్ విధానాలతో విసిగిపోయాయి. ఎలాంటి క్లారిటీ లేకుండా యుద్ధం చేస్తున్న ట్రంప్ వైఖరికి ఇన్వెస్టర్లు భారీ మూల్యం చెల్లిస్తున్నారు.
