టోకనైజేషన్ గడువు పెంపు
క్రెడిట్, డెబిట్ కార్డుల టోకెనైజేషన్ పద్ధతి అమలు చేయడానికి గడువు జూన్ 30 వరకు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వాస్తవానికి ఈ నెలాఖరుతో ఈ గడువు ముగియనుంది. జనవరి 1వ తేదీ నుంచి టోకెనైజేషన్ అమలు కావాల్సింది. ప్రతిసారి ఆన్లైన్ లావాదేవీలు జరిపేటపుడు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.. కొన్ని సర్వీస్ ప్రొవైడర్స్ వద్ద నిక్షిప్తమై ఉంటుంది. ఇక నుంచి అలా కాకుండా క్రెడిట్ కార్డు నంబర్ బదులు ఓ టోకన్ నంబర్ వస్తుంది. అది డబ్బు చెల్లించాల్సిన కంపెనీ లేదా సంస్థకు ఇస్తే… దాని ఆధారంగా కస్టమర్ నుంచి నిధులు బదిలీ అవుతాయి. అంటే ఎక్కడా క్రెడిట్, డెబిట్ కార్డు నంబర్లు ఎవరికీ చెప్పాల్సిన పని ఉండదు. అయితే కొత్త విధానానికి అనుగుణంగా మార్పులు చేయడానికి సమయం కావాలని కంపెనీలు కోరడంతో ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది.