For Money

Business News

వారానికి మూడు రోజులు రావాల్సిందే!

దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌.. ఉద్యోగులను ఆఫీస్‌కు రప్పించే పని మొదలు పెట్టింది. తొలుత కొన్ని రోజులని.. ఆ తరవాత సీనియర్‌ ఉద్యోగులే అని చెప్పిన టీసీఎస్‌.. ఇపుడు వారానికి మూడు రోజులు ఆఫీస్‌ నుంచే పనిచేయాల్సి ఉంటుందని సూచించింది. సిబ్బందికి పంపిన ఈ-మెయిల్‌లో ఈ విషయాన్ని తెలిపింది. ఇటీవల ఐటీ కంపెనీల్లో మూన్‌లైటింగ్‌ అధికమౌతోంది. అంటే ఒక కంపెనీలో పనిచేస్తూ.. మరో కంపెనీకి కూడా పనిచేస్తున్నారు. దీన్ని నివారించేందుకు ఏకైక మార్గం… ఉద్యోగులను ఆఫీసుకు రప్పించడమే మార్గంగా భావిస్తోంది. దీంతో కచ్చితంగా మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పటికే పలువురు సీనియర్‌ స్థాయి ఉద్యోగులు ఆఫీస్‌ నుంచి లేదా క్లయింట్ల లోకేషన్ల నుంచి సేవలు అందిస్తున్నారు. రెండేండ్ల తర్వాత హైబ్రిడ్‌ పద్దతిని ప్రవేశపెట్టాలని అనుకుంటున్న సంస్థ… అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తున్నది. ప్రస్తుతం టీసీఎస్‌లో అంతర్జాతీయంగా 6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మిగిలిన కంపెనీలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశాలు ఉన్నాయి.