For Money

Business News

తెలంగాణలో 2023 సెలవులు ఇవే…

2023 సంవత్సరానికి సంబంధించి జనరల్ సెలవులు, ఆప్షనల్ సెలవుల లిస్టును తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ విడుదల చేశారు. మొత్తం 2023లో 28 జనరల్ సెలవులు, 5 ఆప్షనల్ సెలవులున్నాయి. వాటితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పండగల కోసం, స్పెషల్ డేస్ కోసం 23 నోటిఫైడ్ సెలవులున్నాయి. ఇక ఆదివారం, రెండో శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవులతో పాటు ఉన్నతాధికారుల అనుమతితో 5 ఆప్షనల్ హాలిడేస్ పొందవచ్చని ప్రభుత్వం పేర్కొంది. అయితే బ్యాంకులు మూసి ఉండే సెలువు రోజుల వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ముస్లిముల పండుగల తేదీలలో మార్పు ఉండొచ్చని, ఉంటే ఎప్పటికపుడు తెలుపుతామని ఉత్తర్వుల్లో పేర్కొంది.

నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రూమెంట్స్ యాక్ట్‌ కింద సాధారణ సెలవులు (ఈరోజుల్లో బ్యాంకులు పనిచేయవు)
2023
జనవరి 15 – సంక్రాంతి
జనవరి 26 – గణతంత్ర దినోత్సవం
ఫిబ్రవరి 18 – మహాశివరాత్రి
మార్చి 7 – హోళీ
మార్చి 22 – ఉగాది
మార్చి 30 – శ్రీరామనవమి
ఏప్రిల్ 1 – వార్షిక ఖాతాల ముగింపు
ఏప్రిల్ 4 – బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి
ఏప్రిల్‌ 7- గుడ్‌ ఫ్రైడే
ఏప్రిల్ 14 – అంబేడ్కర్‌ జయంతి
ఏప్రిల్ 22 – రంజాన్‌
మే 1 – మే డే
జూన్ 29 – బక్రీద్
జులై 29 – మొహర్రం
ఆగస్టు 15 – స్వాతంత్య్ర దినోత్సవం
సెప్టెంబరు 7 – కృష్ణాస్టమి
సెప్టెంబరు 18 – వినాయక చవితి
సెప్టెంబరు 28 మిలాద్‌-ఉన్‌-నబి
అక్టోబర్ 2 – గాంధీ జయంతి
అక్టోబరు 24 – విజయదశమి
నవంబర్ 12- దీపావళి
నవంబర్ 27- కార్తీక పూర్ణిమ/ గురునానక్ జయంతి
డిసెంబరు 25 – క్రిస్మస్
……
సాధారణ సెలవులు..

….
జనవరి 1 – నూతన సంవత్సరం
జనవరి 14 – భోగి
జనవరి 15 – సంక్రాంతి
జనవరి 26 – గణతంత్ర దినోత్సవం
ఫిబ్రవరి 18 – మహాశివరాత్రి
మార్చి 7 – హోళీ
మార్చి 22 – ఉగాది
మార్చి 30 – శ్రీరామనవమి
ఏప్రిల్ 5 – బాబు జగజ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 7 – గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 14 – అంబేడ్కర్‌ జయంతి
ఏప్రిల్ 22 – రంజాన్‌
ఏప్రిల్ 23 – రంజాన్ తదుపరి రోజు
జూన్ 29 – బక్రీద్
జులై 17 – బోనాలు
జులై 29 – మొహర్రం
ఆగస్టు 15 – స్వాతంత్య్ర దినోత్సవం
సెప్టెంబరు 7 – కృష్ణాస్టమి
సెప్టెంబరు 18 – వినాయక చవితి
సెప్టెంబరు 28 మిలాద్‌-ఉన్‌-నబి
అక్టోబర్ 2 – గాంధీ జయంతి
అక్టోబర్ 14 – బతుకమ్మ ప్రారంభం
అక్టోబరు 24 – విజయదశమి
అక్టోబరు 24 – విజయదశమి తర్వాతి రోజు
నవంబర్ 12- దీపావళి
నవంబర్ 27- కార్తీక పూర్ణిమ/ గురునానక్ జయంతి
డిసెంబరు 25 – క్రిస్మస్
సెంబర్ 26 – బాక్సింగ్ డే