For Money

Business News

టికెట్ల ధరల పెంపు: తెలంగాణ ఓకే

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి అదనపు రేట్లు వసూలుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈనెల 25న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఎయిర్‌ కండీషన్‌, ఎయిర్‌ కూల్డ్‌ థియేటర్లలో విడుదలైన తొలి మూడు రోజులు అంటే 25, 26, 27 తేదీలలో టికెట్‌కు రూ.50 అదనంగా, ఆ తరవాత 28 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు రూ.30 అదనంగా వసూలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇక రిక్లయినర్‌ ఉన్న సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లతో పాటు ఐమ్యాక్స్‌, మల్టిప్లెక్స్‌ థియేటర్లలో తొలి మూడు రోజులు రూ.100, ఆ తరవాత ఏడు రోజులు రూ. 50లు పెంచేందుకు అనుమతి ఇచ్చింది. మిగిలిన నాన్‌ ఏసీ థియేటర్ల టికెట్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదని తెలంగాణ ప్రభుత్వం… ఉత్తర్వులో పేర్కొంది.