For Money

Business News

కనీస కలెక్షన్‌ రూ.25 కోట్లు?

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుంటే… పరిశ్రమ దృష్టి అంతా ఆ సినిమా క్రియేట్‌ చేసే బాక్సాఫీస్‌ రికార్డులపై పడుతోంది. అభిమానులు కూడా లెక్కలు వేసుకుంటున్నారు. ఇపుడు అనేక పట్టణాల్లో కూడా ప్రైవేట్‌ కంపెనీల ఆన్‌లైన్‌ బుకింగ్‌ సౌకర్యం ఉండటంతో… తొలి రోజు కలెక్షన్స్‌ అంచనా వేయడం కాస్త ఈజీనే. సినిమా వర్గాల మేరకు నైజాం ఏరియాలో (తెలంగాణ ప్లస్‌ కర్ణాటకలోని కొన్ని తెలుగు ప్రింట్లు) ఆర్‌ఆర్‌ఆర్‌ తొలి రోజు కలెక్షన్‌ రూ. 23 కోట్లు ప్లస్‌ షేర్‌ (బెనిఫిట్‌ షోలు లేకుండా, జీఎస్టీతో సహా) ఉంటుందని ఒక వార్త వైరల్‌ అవుతోంది. బెనిఫిట్‌ షోలను కూడా కలిపితే తొలి రోజు కనీసం కలెక్షన్స్‌ రూ.25 కోట్లు దాటుతుందని అంటున్నారు. ఇప్పటి వరకు నైజాం ఏరియాలో తొలి రోజు ఓ సినిమాకు వచ్చిన అత్యధిక కలెక్షన్‌ రూ.11 కోట్లని తెలుస్తోంది. అంటే ఆర్‌ఆర్‌ఆర్‌ తొలిరోజే తెలంగాణలో బాక్సాఫీస్‌ రికార్డులు బద్ధలు కొడుతోందన్నమాట.