For Money

Business News

పన్ను రాయితీలు ఖాయం?

క్రమంగా క్షీణిస్తున్న దేశ ఆర్థిక వృద్ధిని గాడి పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్‌ వేదికగా అనేక కీలక ప్రకటనలను కేంద్రం చేసే అవకాశముందని బిజినెస్‌ పత్రికలు రాస్తున్నాయి. ఇదే అంశంపై గత వారం ప్రధానితో ఆర్థిక శాఖ అధికారులు భేటీ అయినట్లు తెలుస్తోంది. ప్రధానంగా బడ్జెట్‌లో ఇచ్చే పన్ను రాయితీల గురించి ప్రధానంగా చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త పన్ను విధానం కింద పలు రాయితీలు ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల పరిమితిని పెంచడానికి కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కార్పొరేట్‌ పన్ను విధానాన్ని సరళీకరించాలని కూడా కేంద్రం భావిస్తోంది. అలాగే ఇప్పటి వరకు చాలా నెమ్మదిగా సాగుతున్న మూలధన పెట్టుబడులను పెంచాలని కూడా కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కీలక ప్రకటనలు త్వరలోనే రానున్నాయి. బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీలో కూడా కేంద్ర పలు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. చైనా నుంచి వస్తున్న చౌక దిగుమతులను అరికట్టే లక్ష్యంతో కేంద్రం ఈ విధానాలను రూపొందిస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను కూడా కేంద్రం సరళీకరించే అవకాశముంది. దీనికి సంబంధించి కూడా బడ్జెట్‌లో ప్రస్తావనకు రానున్నాయి.