టాటా మోటార్స్ నికర నష్టం రూ.1516 కోట్లు
వరుసగా నాలుగో త్రైమాసికంలో కూడా టాటా మోటార్స్ నష్టాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 72,229 కోట్ల ఆదాయంపై రూ. 1,516 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 75,653 కోట్ల ఆదాయంపై రూ. 2941 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. చిప్ కొరత కారణంగా తమ ప్రధాన అనుబంధ సంస్థ అయిన జాగ్వర్ ల్యాండ్ రోవర్ టర్నోవర్ 4.5 శాతం తగ్గింది. అలాగే 90 లక్షల పౌన్ల నికర నష్టాన్ని ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ ఆదాయం పెరిగింది. భారత్ మార్కెట్ విషయానికొస్తే .. ఇక్కడ కంపెనీ వ్యాపారం 43 శాతం పెరిగి రూ. 20,959 కోట్లకు చేరినట్లు టాటా మోటార్స్ పేర్కొంది. దిగుమతుల భారం అధికంగా ఉన్నందున రూ. 834 కోట్ల నష్టాన్ని పొందినట్లు తెలిపింది. ఇవాళ టాటా మోటార్స్ షేర్లు నాలుగు శాతం పెరిగి రూ. 517 వద్ద ముగిశాయి.