For Money

Business News

దూసుకెళుతున్న నాస్‌డాక్‌

టెస్లాతో పాటు పలు టెక్నాలజీ, ఐటీ షేర్లకు గట్టి మద్దతు అందడంతో వాల్‌స్ట్రీట్‌ ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతోంది. ఆరంభంలో డల్‌గా ఉన్నా వెంటనే కోలుకుంది. ప్రస్తుతం నాస్‌డాక్‌ రెండు శాతం, ఎస్‌ అండ్ పీ 500 సూచీ 0.8 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఎకానమీ షేర్లలో పెద్ద ఉత్సాహం లేకపోవడంతో డౌజోన్స్‌ దాదాపు క్రితం స్థాయి వద్దే ట్రేడవుతోంది. యూరో మార్కెట్లు కూడా గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ 0.9 శాతం లాభంతో ఉంది. డాలర్‌ ఇవాళ భారీగా క్షీణించింది. డాలర్‌ ఇండెక్స్‌ 0.43 శాతం నష్టంతో 96.83 వద్ద ట్రేడవుతోంది. దీంతో ఆయిల్, బులియన్‌ పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 91 డాలర్ల ప్రాంతంలో ట్రేడవుతోంది. బులియన్‌ స్వల్ప లాభంతో ట్రేడవుతోంది.