పబ్లిక్ ఇష్యూకు స్విగ్గీ!
జొమాటో తరవాత.. ఆ కంపెనీ ప్రధాన ప్రత్యర్థి అయిన స్విగ్గీ క్యాపిటల్ మార్కెట్లో ప్రవేశించేందుకు రెడీ అవుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ కంపెనీ మార్కెట్ నుంచి దాదాపు రూ. 6000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. స్విగ్గీలో సాఫ్ట్‌బ్యాంక్‌కు మెజార్టీ వాటా ఉన్న విషయం తెలిసిందే. క్యాపిటల్ మార్కెట్లో ప్రవేశించే ముందు సన్నాహాల్లో భాగంగానే ఇటీవల ఇండిపెండెంట్ డైరెక్టర్లను కంపెనీ నియమించింది. ఇపుడు కేవలం ఫుడ్ డెలివరీకి పరిమితమైన ఈ కంపెనీ లాజిస్టిక్ సేవలపై కూడా దృష్టి సారించింది కూడా. వ్యాల్యూయేషన్ పరంగా చూస్తే జొమాటొ కన్నా స్విగ్గీ విలువ అధికంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.