For Money

Business News

క్యాపిటల్‌ మార్కెట్‌కు సూరజ్‌ ఎస్టేట్‌

ముంబైకి చెందిన సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్ పబ్లిక్‌ ఇష్యూ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ఇవాళ సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. మార్కెట్‌ నుంచి రూ .500 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. మొత్తం తాజా షేర్ల జారీ ద్వారానే సమీకరించనున్నాయి. అంటే ప్రమోటర్ల వాటాల విక్రయం ఉండదన్నమాట. ఇష్యూ ద్వారా సమకూర్చుకునే నిధుల నుంచి రూ .315 కోట్లతో కంపెనీ సహా అనుబంధ సంస్థలైన అకార్డ్ ఎస్టేట్స్, ఐకానిక్ ప్రాపర్టీ డెవలపర్స్, స్కైలైన్ రియాలిటీ రుణాలను తీర్చనుంది. మరో రూ .45 కోట్లను భూమి కొనుగోలు, అభివృద్ధి హక్కులకు వినియోగించనున్నారు. సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ 1986 నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది.