For Money

Business News

వచ్చేవారం లిస్టింగ్స్ ఇవే…

2013లో ఐపీఓలు దుమ్ము రేపాయి. ఏవో కొన్ని తప్ప మెజారిటీ ఐపీఓలు ఇన్వెస్టర్లకు సగటున 45 శాతంపైగా ప్రతిఫలాన్ని ఇచ్చాయి. కొత్త పబ్లిక్‌ ఆఫర్ల హంగామా వచ్చే వారం కూడా కొనసాగనుంది. ఆఫర్‌ క్లోజింగ్‌కు, లిస్టింగ్‌ తేదీ మధ్య గ్యాప్‌ తగ్గడంతో ఇష్యూలకు సబ్‌స్క్రయిబ్‌ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. డిసెంబర్‌ 21-27 మధ్య పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చిన సమీరా ఆగ్రో అండ్‌ ఇన్‌ఫ్రా షేర్‌ రేపు అంటే సోమవారం స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ కానుంది. రూ. 62.64 కోట్ల సమీకరణకు వచ్చిన ఈ ఆఫర్‌ కేవలం 2.8 రెట్లు మాత్రమే సబ్‌స్క్రయిబ్‌ అయింది. దీంతో రేపు ప్రీమియం ఎంత ప్రీమియంతో లిస్ట్‌ అవుతుందో చూడాలి. గ్రే మార్కెట్‌ లెక్కల ప్రకారం చూస్తుంటే ఈ షేర్‌ డిస్కౌంట్‌తో లిస్ట్‌ కావొచ్చు. లేదా ముఖ విలువ వద్ద లిస్ట్‌ అయ్యే అవకాశముంది. రూ. 180లకు ఈ కంపెనీ షేర్లను అలాగ్‌ చేసింది.
ఇక జనవరి 2వ తేదీన ఏఐకే పైప్స్ అండ్‌ పాలిమర్స్‌ బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ సిగ్మెంట్‌లో లిస్ట్‌ కానుంది. 40 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయిన ఈ ఆఫర్‌ ద్వారా కంపెనీ రూ. 15 కోట్లు సమీకరించింది. అయితే ఈ ఇష్యూ కూడా ముఖవిలువకు లేదా నామ మాత్రపు ప్రీమియంతో లిస్ట్‌ అయ్యే అవకాశముంది.

జనవరి 3న నాలుగు ఆఫర్‌లు లిస్ట్‌ కానున్నాయి. ఆకాంక్ష పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు హెచ్‌ఆర్‌హెచ్‌ నెక్ట్స్‌ సర్వీస్‌లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌ కానున్నాయి. మనోజ్‌ సిరామిక్‌, శ్రీ బాలాజీ వాల్వ్‌ కాంపొనెంట్స్ ఇష్యూలు బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ విభాగంలో లిస్ట్‌ కానున్నాయి. వీటిలో ఆకాంక్ష పవర్‌ షేర్‌ రూ. 65 వద్ద లిస్ట్‌ అయ్యే అవకాశముంది. ఈ కంపెనీ రూ. 55లకు షేర్లను అలాట్‌ చేసింది. అంటే రూ. 10 ప్రీమియం పలికే అవకాశముంది. శ్రీ బాలాజీ వాల్వ్‌ షేర్‌ను కంపెనీ రూ. 100లకు ఆఫర్‌ చేసింది. గ్రే మార్కెట్‌ వర్గాల ప్రకారం ఈ షేర్‌ రూ. 36 ప్రీమియంతో అంటే రూ. 136 వద్ద లిస్ట్‌ అయ్యే అవకాశముంది.

అయితే కేసీఎనర్జి అండ్‌ ఇన్‌ఫ్రా కంపెనీ పబ్లిక్ ఆఫర్‌ జనవరి 2న క్లోజ్‌ కానుంది. ఈ షేర్‌ 5వ తేదీన లిస్ట్‌ కానుంది. ఇప్పటికే కంపెనీ ఐపీఓ 146 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. ఈ షేర్‌ కూడా ఆకర్షణీయ ప్రీమియంతో లిస్ట్‌ అయ్యే అవకాశముంది.