For Money

Business News

పెట్రోల్‌, డీజిల్‌ కొరత

ట్రక్‌, బస్సు డ్రైవర్ల సమ్మెతో దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడింది. ప్రధాన నగరాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో కూడా పెట్రోల్‌ పంపుల ఎదుట వాహనాలు క్యూలో ఉంటున్నాయి. సమ్మె కారణంగా పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా ఆగిపోవడంతో అనేక పెట్రోల్‌ బంకుల్లో నిల్వలు నిండుకున్నాయి. దీంతో పలు బంకుల వద్ద నో స్టాక్‌ బోర్డు పెడుతున్నారు. దీంతో పెట్రోల్‌, డీజిల్ ఉన్న బంకుల వద్ద వాహనాల క్యూ పెరిగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం ఇక నుంచి హిట్‌ అండ్ రన్‌ కేసులో డ్రైవర్లకు పదేళ్ళ వరకు శిక్ష పడేలా నిబంధనలు తెచ్చారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే దాన్ని పోలీసులకు తెలుపకున్నా.. లేదా ఘటనా స్థలం నుంచి పారిపోయినా… పదేళ్ళ జైలు శిక్ష పడేలా చట్టంలో మార్పు చేశారు. గతంలో నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేసిన డ్రైవర్లకు రెండేళ్ళ దాకా శిక్ష పడేది. పాత నిబందనల స్థానంలో తెచ్చిన కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా డ్రైవర్లు ఇపుడు దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు.