For Money

Business News

కోలుకున్నా నష్టాలే

ఉదయం ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్‌ కూడా భారీగా నష్టపోయింది. ఒకదశలో నిఫ్టి 21555 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. చైనా మార్కెట్లు ఒక మోస్తరుగా నష్టపోగా, హాంగ్‌సెంగ్‌ ఒకటిన్నర శాతం దాకా నష్టపోయింది. తరవాత మన మార్కెట్లు కోలుకున్నాయి. దాదాపు వంద పాయింట్లకు పైగా కోలుకుంది.క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 76 పాయింట్ల నష్టంతో 21,665 వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్‌ కూడా 379 పాయింట్లు నష్టంతో 71,892 పాయింట్ల వద్ద క్లోజైంది. దేశంలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫార్మా కంపెనీల షేర్లకు గట్టి మద్దతు లభిస్తోంది. దివీస్‌ ల్యాబ్‌, సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా వంటి షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీలో దివీస్‌ ల్యాబ్‌, అదానీ పోర్ట్స్‌, సన్‌ఫార్మా, కోల్‌ ఇండియా, సిప్లా షేర్లు టాప్‌ ఫైవ్‌లో ఉన్నాయి. ఇక నష్టాల్లో ముగిసిన నిఫ్టి టాప్‌ 5 షేర్లలో ఐషర్‌ మోటార్స్‌, ఎం అండ్‌ ఎం, ఎల్‌అండ్‌టీ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, కొటక్‌ మహీంద్రా షేర్లు ఉన్నాయి. ఇక సెన్సెక్స్‌లో వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, మేఘమణి ఆర్గానిక్స్‌, మహీంద్రా లాజిస్టిక్స్‌, పీటీసీ ఇండస్ట్రీస్‌ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.