NIFTY TRADE: లాంగ్ పొజిషన్లో ఉండండి
విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ళ కారణంగా నిఫ్టిలో లాంగ్ ఉంటే..ఆ పొజిషన్స్‌ను కంటిన్యూ చేయమని సలహా ఇస్తున్నారు ప్రముఖ స్టాక్ అనలిస్ట్ వీరేందర్ కుమార్. ఫ్యూచర్స్ కంటే ఆప్షన్స్‌లో సెల్లింగ్ జోరుగా ఉంది.17500 లేదా 17550 బేస్‌గా పొజిషన్స్‌ను కంటిన్యూ చేయొచ్చు. రిలయన్స్, ఐటీ షేర్లతో పాటు బ్యాంకులకు మద్దతు కొనసాగే అవకాశం ఉందని వీరేందర్ అంటున్నారు. నిఫ్టి ఇవాళ్టి లెవల్స్ 17,681, 17737గా వీరేందర్ పేర్కొన్నారు. దిగువ స్థాయిలో 17551, 17490 వద్ద మద్దతు లభించవచ్చని అంటున్నారు. బ్యాంక్ నిఫ్టి లెవల్స్ కోసం వీడియో చూడండి.