స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఐపీఓకు సెబీ ఓకే
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఐపీఓకు సెబీ ఆమోదం తెలిపింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 5,500 కోట్లు సమీకరించాలని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతిపాదించింది. ఇందులో రూ. 2000 కోట్లను కొత్త షేర్ల జారీ ద్వారా సమీకరించదలచింది. మిగిలిన మొత్తానికి సరపడా షేర్లను ఇపుడున్న ఇన్వెస్టర్లు అమ్ముతున్నారు. ఇన్వెస్టర్లు దాదాపు ఆరు కోట్ల షేర్లను అమ్ముతున్నారు. ఇందులో కేవలం సేఫ్ కార్ప్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియా ఒక్కటే మూడు కోట్ల షేర్లను అమ్ముతోంది. ఇష్యూ ద్వారా వచ్చే సొమ్ముతో క్యాపిటల్ బేస్‌ను పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది.