For Money

Business News

డిమార్ట్‌ లాభం డబుల్‌

దేశ వ్యాప్తంగా డీ మార్ట్‌ స్టోర్స్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ అద్భుత పనితీరును కనబర్చింది. సెప్టెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.7,788 కోట్ల టర్నోవర్‌పై రూ.417 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.5306 కోట్ల టర్నోవర్‌పై రూ.198.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాదితో పోలిస్తే కంపెనీ నికర లాభం రెట్టింపు అయింది. కంపెనీ మార్జిన్‌ కూడా 6.2 శాతం నుంచి 8.6 శాతానికి పెరిగింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 5,031 కోట్ల టర్నోవర్‌పై రూ.115 కోట్ల నికర లాభం ఆర్జించింది. గడచిన మూడు నెలలతో పోలిస్తే కంపెనీ ఆదాయం, నికర లాభం భారీగా పెరిగాయి.