24 శాతం వాటా విక్రయం?
తనకున్న వాటాలో కొంత భాగాన్ని విక్రయించాలని యోచిస్తున్నారు స్పైస్ జెట్ యజమాని అజయ్ సింగ్. ప్రస్తుతం ఈ కంపెనీలో అజయ్ సింగ్‌కు 60 శాతం వాటా ఉంది. కనీసం 24 శాతం వాటా అమ్మడానికి ఆయన కొన్ని కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్‌క్‌కు చెందిన ఓ విమానయాన కంపెనీ స్పైస్‌జెట్‌లో వాటాకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే భారత్‌కు చెందిన ఓ ప్రముఖ పారిశ్రామిక గ్రూప్ కూడా వాటా కొనుగోలుకు ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది.