For Money

Business News

నికర లాభం రూ.278 కోట్ల నుంచి రూ.4,780 కోట్లకు

అదానీ గ్రూప్‌ పవర్‌ అలా ఉంది మరి. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అదానీ పవర్‌ రూ. 4780 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ కంపెనీ నికర లాభం రూ 278 కోట్లు మాత్రమే. అంటే 1600 శాతం పెరిగిందన్నమాట. ఇదే సమయంలో కంపెనీ టర్నోవర్‌ కూడా 115 శాతం పెరిగి రూ. 7213 కోట్ల నుంచి రూ. 15,509 కోట్లకు చేరింది. పీపీఏ టారిఫ్‌ పెరగడంతో పాటు గుజరాత్ డిస్కామ్‌లతో పీపీఏలు పునరుద్ధరణ కారణంగానే కంపెనీ టర్నోవర్‌ పెరిగింది. దాదాపు రూ. 2561 కోట్ల ఆదాయం పాతది. ఈఏడాది ఖాతాల్లో చూపారు. అలాగే రూ. 1651 కోట్ల పాత ఇతర ఆదాయం పద్దును కూడా ఈ ఏడాది కలిపారు. నిజానికి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ 58.6 శాతమే. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో 64.8 శాతం ఉండేది.