For Money

Business News

స్థిరంగా సింగపూర్‌ నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఆరంభంలో ఒక మోస్తరు నష్టాల్లో ఉన్న సూచీలు క్లోజింగ్‌ సమయానికి కోలుకున్నాయి. నాస్‌డాక్‌ గ్రీన్‌లో క్లోజ్‌ కాగా మిగిలిన సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. నాస్‌డాక్‌ 0.02 శాతం, ఎస్‌ అండ్‌ పీ 0.3 శాతం, డౌజోన్స్‌ 0.46 శాతం నష్టంతో ముగిశాయి. బ్యాంకుల ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో డౌజోన్స్‌లో ఒత్తిడి అధికంగా ఉంది. డాలర్‌ ఇండెక్స్‌ 108పైనే కొనసాగుతోంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా మిశ్రమంగా ఉన్నాయి. జపాన్‌ నిక్కీ 0.54 శాతం లాభంతో ఉంది. హాంగ్‌సెంగ్‌ అరశాతం నష్టంతో ఉంది. మిగిలిన సూచీల లాభనష్టాల్లో పెద్ద తేడా లేదు. అన్నీ దాదాపు క్రితం ముగింపు వద్దే ఉన్నాయి… ఒక్క ఆస్ట్రేలియా తప్ప. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి 20 పాయింట్ల లాభంతో ఉంది. రాత్రి క్రూడ్‌ ధరలు 95 డాలర్ల దాకా పడినా.. క్లోజింగ్‌కల్లా మళ్ళీ 99 డాలర్లను దాటాయి. సో.. నిఫ్టి స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.