For Money

Business News

బంగారం, వెండి – డబుల్‌ ట్రబుల్‌

మొన్నటిదాకా డాలర్‌తో పాటు బులియన్‌ ధరలు పెరిగే సరికి… మన మార్కెట్‌ బంగారం, వెండి దుమ్ము రేపాయి. ఇపుడు సేమ్‌… రివర్స్‌లో నడుస్తున్నాయి. డాలర్‌తో పాటు మెటల్స్‌ కూడా భారీగా క్షీణించడం ఇవాళ్టి విశేషం. అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ ఇండెక్స్‌ 0.4 శాతం క్షీణించి 99 దిగువకు వచ్చేసింది. దెబ్బకు పెరగాల్సిన మెడల్స్‌ కూడా క్షీణించాయి. అమెరికా బులియన్‌ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1.3 శాతం క్షీణించి 1959 డాలర్లకు పడిపోయింది. ఇదే సమయంలో వెండి ఏకంగా 2.77 శాతం క్షీణించి 25.42 డాలర్లకు పడిపోయింది.
ఇక మన ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో బులియన్‌ డబుల్‌ ట్రబుల్‌ మొదలైంది. సాధారణంగా డాలర్‌ బలహీనపడితే అంటే రూపాయి బలపడితే మన మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుతాయి. ఇదే సమయంలో బంగారం ధరలు కూడా తగ్గితే… మన వద్ద ఇంకా పడుతాయి. అలాగే ఉంది పరిస్థితి ఇపుడ. ఎంసీఎక్స్‌లో స్టాండర్డ్‌ బంగారం ఏప్రిల్‌ కాంట్రాక్ట్‌ రూ.681 తగ్గి రూ.52,197లకు పడింది. మరి రాత్రికి రూ. 52,000 దిగువకు వెళుతుందేమో చూడాలి. ఇక వెండి ఏకంగా రూ.1.491 క్షీణించి రూ.68,879 వద్ద ట్రేడవుతోంది.