For Money

Business News

భారీ నష్టాల్లో సింగపూర్‌ నిఫ్టి

గత గురువారం నాలుగు శాతం దాకా నష్టోయిన వాల్‌స్ట్రీట్‌ శుక్రవాం ఒక మోస్తరు నష్టాలతో ముగిసింది. నాస్‌డాక్‌ 1.4 శాతం నష్టపోగా… డౌజోన్స్‌ 0.3 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ .6 శాతం దాకా నష్టపోయింది. పోనీ.. ఇవాళ ఏమైనా గ్రీన్‌లో ఓపెన్‌ అవుతుందా అంటే. అలాంటి సంకేతాలు లేవు. ఎస్‌ అండ్‌ పీ 500 ఫ్యూచర్స్‌ మరో 1.23 శాతం నష్టంతో ఉంది. అలాగే డౌజోన్స్‌ కూడా 1.2 శాతంపైగా నష్టంతో ఉంది. దీంతో ఆసియా మార్కెట్లలో కూడా ఒత్తిడి తీవ్రంగా ఉంది. జపాన్‌ నిక్కీ రెండు శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ మార్కెట్‌లలో కూడా ఇదే తరహా పతనం కొనసాగుతోంది. చైనా మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌కాంగ్‌ మార్కెట్‌కు ఇవాళ సెలవు. ఈనేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 196 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. చూస్తుంటే నిఫ్టికి ఇవాళ 16200 స్థాయి ఓ పరీక్షగా మారే అవకాశముంది.